‘అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే..రేవంత్ రెడ్డినీ అరెస్ట్ చెయ్యాలి’..కేటీఆర్
హీరో అల్లు అర్జున్ అరెస్టుపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఫైర్ అయ్యారు. తొక్కిసలాట వల్ల మహిళ మరణించడానికి అల్లు అర్జున్ ఎలా బాధ్యుడవుతాడని ప్రశ్నించారు. అలా అయితే హైడ్రా చర్యల వల్ల మరణించిన వారి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు. హైడ్రా చర్యల వల్ల ఇద్దరు మరణించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగువారికి గర్వకారణమైన జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ను సాధారణ మనిషిలా అరెస్టు చేసి, పోలీసులు తొందరపడ్డారని మండిపడ్డారు కేటీఅర్. ఎలాంటి ప్రత్యక్ష్య ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన ప్రభుత్వం తీరు సరైనది కాదన్నారు.

