Breaking NewsHome Page SliderInternational

పాక్‌లో ఉద్రిక్తత..ఐదుగురు మృతి

పాకిస్థాన్‌లో భారీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలంటూ ఆందోళనకారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుదారులు చేపట్టిన ఈ నిరసనల కారణంగా ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందారని ప్రభుత్వం పేర్కొంది. దీనితో ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దించింది. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారులను మూసివేసింది. రైళ్లు, మెట్రో బస్సుల సర్వీసులు కూడా నిలిపివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ పిలుపు మేరకు నిరసనలు పెల్లుబికాయి. వీరి నిరసన ప్రదర్శన ఇస్లామాబాద్ చేరుకుని అల్లర్లు ప్రారంభించింది. ఇమ్రాన్ జైలు నుండి వచ్చాకే ఇంటికి వెళ్తామంటూ ఆయన భార్య వ్యాఖ్యానించారు. దీనితో ఆయన మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు పెద్దఎత్తున చేపట్టారు.

BREAKING NEWS: ఓ విద్యార్థి ప్రాణం తీసిన పూరీలు