కామెడీ టైమింగ్‌లో అదరగొట్టిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవిని ఆల్ రౌండర్ హీరోగా చెప్పవచ్చు. యాక్షన్, డ్యాన్సులే కాకుండా కామెడీని కూడా పండించగలరు. తాజాగా సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటించిన చిత్రం ‘జీబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్. ఈ ఈవెంట్‌లో అభిమానిని ఆటపట్టిస్తూ కామెడీ టైమింగ్‌లో అదరగొట్టారు. చిరంజీవి మాట్లాడుతూండగా, ‘బాసూ వైజాగ్ నుండి వచ్చాం’ అని అభిమానులు అరవడంతో, చిరు టక్కున వైజాగ్ స్లాంగ్‌లో మాట్లాడడం మొదలుపెట్టారు. “అయితే ఏటంటావ్ ఇప్పుడు, మరి ఈ బొమ్మను వైజాగ్‌లో ఆడించాలి”.. అంటూ సరదాగా మాట్లాడడంతో అందరూ షాకయ్యారు. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఈవెంట్‌లో చిరంజీవి సినిమాలలోని డ్యాన్సులతో హీరో సత్యదేవ్ అదరగొట్టారు.

