ఈ నెల 25న బీజేపీ మహాధర్నా
మూసీ బాధితులకు భరోసానిచ్చేందుకు ఈ నెల 25న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. నాంపల్లి పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాలు పర్యటించి, బాధితులను పరామర్శిస్తాయని వెల్లడించారు. 18 మూసీ పరివాహక ప్రాంతాలను మొత్తం 9 బృందాలు విజిట్ చేయనున్నట్లు వివరించారు. ఒక్కో బృందంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఉన్నట్లు తెలిపారు.