Andhra PradeshHome Page SliderNews

‘భూమ్ భూమ్ బ్రాండ్లు’ తెచ్చిందెవరు..జగన్

తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లిక్కర్ వ్యవహారంపై, ఇసుక కాంట్రాక్టులపై మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే కొత్త కొత్త లిక్కర్ బ్రాండ్లు తెచ్చారని విమర్శించారు. భూమ్ భూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్ 999, ట్రిపుల్ నైన్ లెజెండ్, హెవెన్స్ డోర్, క్లిఫ్ హంగర్ అంటూ విచిత్రమైన పేర్లు పెట్టి 2019 ముందే రాష్ట్రం మొత్తం అమ్మేశారన్నారు.   ఆయన 2019 ఎన్నికలయ్యాక, ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టారన్నారు. దసరా పండుగ రోజు  108 ఇసుక టెండర్లు పిలిచారని విమర్శించారు. రెండు రోజుల్లో తమ వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందంటూ స్కామ్‌లకు తెరలేపారన్నారు. లిక్కర్ విషయంలో కొత్త డిస్టలరీకు తమ ప్రభుత్వ కాలంలో కొత్తగా లైసెన్సులు ఇవ్వలేదన్నారు. అదే డిస్టలరీల నుండి వచ్చిన లిక్కర్‌నే పేర్లు మార్చి, నాణ్యమైన లిక్కర్ అంటూ అబద్దాలకు రెక్కలు కట్టేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోయిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.