‘రూ.5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’…భట్టి
రాష్ట్రంలో ఐదువేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి, వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం. ఇవి దేశానికే ఆదర్శంగా ఉంటాయి. దసరా కంటే ముందే నిర్మాణానికి భూమి పూజ చేస్తాం. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం అని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్టాండప్స్తో 20-25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక్కో పాఠశాలకు రూ. 25 నుంచి 26 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు పక్కా భవనాలు లేక అద్దె భవనాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర బోధన చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి రాష్ట్రంలో విద్యా విప్లవం సృష్టించబోతున్నాం” అని వివరించారు.

