Home Page SliderNational

మలయాళం మూవీ ఆర్టిస్ట్ చీఫ్‌ పదవికి మోహన్‌లాల్ రాజీనామా

తిరువనంతపురం: ప్రముఖ నటుడు సిద్ధిక్, చిత్ర నిర్మాత రంజిత్ బాలకృష్ణన్‌తో సహా మాలీవుడ్‌లోని ప్రముఖులపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో నటుడు మోహన్‌లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అమ్మా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఫిల్మ్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ కూడా రాజీనామాలు సమర్పించారు. నిర్ణయాధికారం తీసుకునే అత్యున్నత సంస్థ “నైతిక బాధ్యత” తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

మలయాళ సినీ పరిశ్రమలో మహిళ నటులపై వేధింపుల వ్యవహారంపై హేమా కమిటీ నివేదిక తర్వాత చిచ్చురేగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇద్దరు ప్రముఖులు పదవులకు రాజీనామా చేశారు. సినీ పరిశ్రమలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిక్ వరుసగా ప్రభుత్వ చలనచిత్ర అకాడమీ, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (A.M.M.A)లో తమ పదవులకు రాజీనామా చేశారు.