“ఏపీ ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయడం లేదు”…అంబటి రాంబాబు
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అవి ఈసీ క్లియర్ చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సీఈవో వివేక్ యాదవ్‌తో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఫామ్ 20 ని ఎలక్షన్ అనంతరం ఇంతవరకూ ఎందుకు అప్లోడ్ చేయడం లేదన్నారు. తమకు పోలింగ్ శాతంపై అనుమానాలు ఉన్నాయని, పోలింగ్ శాతాన్ని 3 సార్లు ఎందుకు ప్రకటించారో అంతుపట్టలేదన్నారు. ఏ అసెంబ్లీ స్థానంలో, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఈసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ అశ్రద్ధ పరుస్తోందని మండిపడ్డారు.

