కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
కళ్యాణలక్ష్మి చెక్కులు పేదలకు వరమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్‌లోని షంషీర్ ఫంక్షన్ హాల్‌లో వెంగళ్‌రావు నగర్ డివిజన్‌కు చెందిన 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్య రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

