కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు అరెస్టు వారెంట్ జారీ
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. పోక్సో కేసులో ఆయనకు బెంగళూరు కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. ఒక మహిళ తన 17 ఏళ్ల కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో ఆయనను విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ఢిల్లీలో ఉన్నానని వచ్చాక వస్తానని ఆయన సమాధానం పంపడంతో పాటు ముందస్తు బెయిలుకు ప్రయత్నించారు. కోర్టు ఈ పిటీషన్‌ను కొట్టివేయడంతో ఆయనకు ఈ వారెంట్ జారీ అయ్యింది.

