టీడీపీకి విరాళాల కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ప్రజల నుండి విరాళాలు కోరారు. పార్టీ ఫండ్ గా చంద్రబాబు ₹99,999 మొదటి విరాళంగా అందించారు. ఈ సంఖ్య పార్టీని శక్తివంతం చేస్తుందని అన్నారు. వ్యక్తులు ₹99, ₹999, ₹9,999, ₹19,999, ₹99,999 డినామినేషన్‌లలో నిధులను విరాళంగా ఇవ్వడానికి వీలు కల్పించింది. టీడీపీ తెలుగు ప్రజల జీవితాల్లో భాగమని, పార్టీకి విరాళం ఇవ్వడం దాని నిర్వహణలో పాలుపంచుకున్నట్లేనని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తెలుగుదేశం కోసం వెబ్‌సైట్ tdpforandhra.comని తీసుకువచ్చామన్న ఆయన దీని ద్వారా మీరు డబ్బును సులభంగా విరాళంగా అందించవచ్చని తెలిపారు.