బీజేపీకి ఓటేస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు పోతాయ్-సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా అంటున్నారని… ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ, అమిత్ షా వల్ల కాదన్నారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. మైనారిటీ స్కూళ్లకు, రెసిడెన్షియల్స్ భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందన్నారు రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఎల్బీ సేడియంలో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.


