Andhra PradeshHome Page Slider

రేపు టీడీపీ రెండో జాబితా విడుదల

ఏపీలో ఈసారి కూటమితో ఎన్నికల బరిలో దిగుతున్న టీడీపీ ఇప్పటికే 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జనసేన 6 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ-జనసేనకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించగా.. టీడీపీ మిగతా సీట్లలో పోటీ చేయనుంది. ఇంకా 50 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే నియోజకవర్గాల కేటాయింపుపై ఈ రాత్రికి క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పోటీ చేసే 21 స్థానాల విషయంలో క్లారిటీ రాగా, బీజేపీకి కేటాయించిన సీట్లను వదిలి మిగతా సీట్లలో అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. పి. గన్నవరం సీటును మహాసేన రాజేష్ కు ఇచ్చినప్పటికీ ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ సీటు బీజేపీకి ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో టీడీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే 102 సార్లు అభ్యర్థుల్ని మార్చిన వైసీపీ… 16న పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

టీడీపీ మొదటి లిస్ట్