Andhra PradeshHome Page Slider

ప్రత్యర్థులతో యుద్ధం ప్రారంభించాం… దెందులూరు సభలో సీఎం జగన్

మరో చారిత్రాత్మక విజయం సాధించడానికి అందరూ సిద్ధమా అంటూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సభను ప్రారంభించారు వైఎస్ జగన్. పేదల భవిష్యత్ ను మరింత గొప్పగా మార్చేందుకు, మరోసారి గెలిపించుకునేందుకు మీరందరూ సిద్ధమేనా అంటూ కార్యకర్తలను కోరారు. పేదల భవిష్యత్‌ను, పేదలను కాటేసే ఎల్లో వైరస్ పైనా , కన్పిస్తున్న దుష్ట చతుష్టయంపైనా అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు కుట్రలను ఛేదించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. రామాయణం, మాహాభారతం యుద్ధంలో ఉన్న విలన్లందరూ మన చుట్టూ ఉన్నారన్నారు. తాను చేసిన మంచిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తోడేళ్లందరి మధ్య జగన్ ఒంటరిగా కన్పిస్తాడని కానీ కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడన్నారు. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని చెప్పడానికి వచ్చానన్నారు జగన్.

ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు… 1995లో సీఎం అయిన చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్ కు గానీ ఏం చేశాడని అడగాలని ఆయన కార్యకర్తలను కోరారు. ప్రతి ఇంట్లోనూ అడగాలని పిలుపునిచ్చారు. అదే పేద కుటుంబాన్ని అడగండి.. పదేళ్ల బ్యాంక్ అకౌంట్ డీటేల్స్ తీసుకోమని వారినే అడగాలన్నారు జగన్.. చంద్రబాబు ఐదేళ్లు, జగన్ ఐదేళ్ల పాలనను పదేళ్ల పాలనను బ్యాంక్ అకౌంట్ వివరాలను చూడాలన్నారు జగన్.. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పేద కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని అడగాలన్నారు జగన్… నాడు వచ్చిన స్కీములు, నేడు వచ్చిన స్కీములు ఏమున్నాయని అడగాలన్నారు జగన్. డీబీటీ బటన్లు నొక్కి లంచాలు లేకుండా పథకాలను చేర్చానన్నారు జగన్.

ప్రతిపక్షాలతో చేస్తున్న యుద్ధానికి మహా సంగ్రామానికి, నా కుటుంబ సభ్యులైనా ప్రతి అక్కా, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు, ప్రతి అవ్వ, ప్రతి తాత.. మీరంతా కూడా సిద్ధమేనా అన్నారు వైఎస్ జగన్. జగన్ ఒంటరని ప్రత్యర్థులు అనుకుంటున్నారని.. కానీ ఇంత మంది గుండెల్లో చోటు ఉన్న సంగతి వారికి తెలియదన్నారు. మీ గుండెల్లో చోటు దక్కించుకోవడమే నిజమని జగన్ చెప్పారు. జగన్ ఏనాడు ఒంటరి కాదని.. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సైన్యం మీరేనని ప్రజలను చూయించారు. కానీ వారికి మాత్రం పొత్తులు, ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీలున్నాయన్నారు. కానీ తనకు తోడు, ధైర్యం, బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా అంటూ చెప్పుకొచ్చారు జగన్. నాయకుడిని ప్రజలు నమ్మారంటే స్పందన ఎలా ఉంటుందంటే దానికి దెందులూరు సభే నిదర్శనమన్నారు.

చంద్రబాబు ఎవరి ఎకౌంట్లలోనే ఒక్క రూపాయైనా వేశారా అన్నారు జగన్. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని 1994లోగానీ, 1999లోగానీ, 2014లో గానీ టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 10 శాతమైనా అమలు చేశాడా అని అక్కచెల్లెమ్మలను అడగాలన్నారు జగన్… మరోవైపు జగన్ పాలన చూడాలని కోరాలన్నారు జగన్… 57 నెలల జగన్ పాలనలో ఏం చేశానో చెప్తానన్నారు జగన్… చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడా చూడాలన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామం అయినా తీసుకోవాలన్నారు. ఏ పట్టణం తీసుకోవచ్చన్నారు. నాలుగు అడుగులు వేస్తే గతంలో లేని సచివాలయం, వార్డు సెక్రటేరియట్ అన్నీ కూడా వైసీపీ, జగన్ పెట్టారని చెప్పాలన్నారు. ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇస్తోంది వాలంటీర్లని ఇదంతా జగన్, వైసీపీ సర్కారు తెచ్చాయన్నారు. జన్మభూమి కమిటీలు లేకుండా అర్హులకు పథకాలిచ్చామన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులను ఎవరు మార్చారు, స్కూళ్లను ఎవరు మార్చారంటే చెప్పాలని కోరారు వైఎస్ జగన్. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్ తెచ్చింది జగన్ అన్నారు. ఇంటికి వచ్చి వైద్యం చేస్తోంది ఎవరి పాలనలో చూడాలన్నారు. వైద్యం నేరుగా ఇంటికి వస్తోందంటే కారణం జగన్, వైఎస్సార్సీపీ అన్నారు. 108, 104 , ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీఇంబర్స్మెంట్ వైఎస్సార్ తీసుకొస్తే.. వాటిని మరింత మెరుగ్గా నాలుగు అడుగులు ముందుకు వేయిస్తా ఉంది జగన్ అని చెప్పారు. 2019కి ముందు అసాధ్యమనుకున్న పనులను సాధ్యమని చేసి చూపించామన్నారు జగన్. తన పాలన నుంచే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత వచ్చిందన్నారు.

ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవన్నారు వైఎస్ జగన్. ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు కావు.. ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించేవి కావు.. ఈ ఎన్నికలు 57 నెలలుగా పేదలకు అందుతున్ సంక్షేమాన్ని, వారి భవిష్యత్ ను నిర్ణయించునున్న ఎన్నికలు ఇవి.. ప్రతి అవ్వా, తాత, కుటుంబం భవిష్యత్ అన్నారు జగన్. అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు జగన్. ఒకటో తారీఖు మూడు వేలు పింఛన్ రావాలన్నా.. భవిష్యత్ లో పెరగాలన్నా… జగన్ రావాలన్నారు. మూడు వేలు చేసిన పింఛన్ ఒకటో తేదీ చేరాలన్నా.. ఇంటికి పింఛన్ రావాలన్నా.. మీ ఊరికే, మీ ఇంటికే వైద్యం అందాలన్నా.. వైద్యం కోసం ఏ పేదోడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుడదన్నా వైసీపీ సర్కారు రావాలన్నారు జగన్… పథకాలు అందుకుంటున్నవారందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలన్నారు.