Home Page SliderTelangana

ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుకు నేడే చివరి రోజు

7 వ రోజు ప్రజాపాలనలో 18 ,29 ,274 అభయహస్తం దరఖాస్తులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలకు.. ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి అర్జీలు సమర్పించేందుకు ఈరోజే చివరి అవకాశం. ప్రస్తుతం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని వారు కంగారు పడోద్దని.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. మళ్లీ తిరిగి 4 నెలల తర్వాత ఈ ప్రక్రియ ప్రారం భమవుతుందని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని వివరించారు. అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అందజేస్తామని తెలిపారు.

హైదరాబాద్, జనవరి 5 :: ప్రజాపాలన లోభాగంగా నేడు (శుక్రవారం ) నిర్వహించిన గ్రామసభల్లో 18 , 29 ,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. నేడు స్వీకరించిన వాటితో మొత్తం ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115 లకు చేరింది. నేడు అందిన దరఖాస్తుల్లో ప్రధానంగా ఏడు గ్యారెంటీలకు సంబంధించి 10 ,68 ,276 దరఖాస్తులు రాగా, 2 ,60 ,998 ఇతర అంశాలవి ఉన్నాయి. ఈ ఏడు రోజులకు కలిపి అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించి 93 ,38 ,111 దరఖాస్తులు ఉండగా, ఇతర అంశాలకు సంబంధించి 15 ,55 ,704 ఉన్నాయి. శుక్రవారం వరకు మొత్తం 12 ,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలనా నిర్వహించారు. ఈ ప్రజాపాలన గ్రామ సభల్లో ఇప్పటి వరకు 1 ,02 ,49 ,312 గృహస్తులు (హౌస్ హోల్డ్స్ ) పాల్గొన్నారు.