Home Page SliderNational

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 300 కేసులు కేరళలోనే వెలుగుచూశాయని తెలిపింది. నిన్న దేశంలో 6 కరోనా మరణాలు సంభవించాయి. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు మృతి చెందారు. నిన్న తెలంగాణలో 5, ఏపీలో 1 కేసు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 2,669 యాక్టివ్ కేసులున్నాయి.