Home Page SliderTelangana

పదవీ బాధ్యతలు స్వీకరించిన సీతక్క

హైదరాబాద్, డిసెంబర్ 14 :: రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.