Andhra PradeshHome Page Slider

జైల్లో లాయర్లతో కలిసి కేసులపై చర్చించేందుకు నో-ఏసీబీ కోర్టు

తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు లీగల్ ములాఖత్‌లను పెంచాలంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

   విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు లీగల్ ములాఖత్‌లను పెంచాలంటూ ఆయన తరపు అడ్వొకేట్లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చనందన ఇప్పుడు విచారణ అవసరం లేదని న్యాయాధికారి తెలిపారు. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు కోర్టు అనుమతినిచ్చింది.

   న్యాయవాదులకు ఇచ్చే రోజుకు రెండు ములాఖత్‌లను జైలు అధికారులు ఒకటికి కుదించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులలో కేసులు విచారణ జరుగుతున్న తరుణంలో రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని కోరారు. కనీసం 45-50 నిమిషాలు చర్చించేందుకు అవకాశం ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.