Home Page SliderNational

బీసీసీఐ ప్రతినిధులకు పాకిస్తాన్‌లో గ్రాండ్ వెల్కమ్, ఐతే వీడని పీఠముడి

బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పాకిస్తాన్ పర్యటనపై ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పొరుగు దేశంలో లభించిన ఆప్యాయత, స్నేహపూర్వక మర్యాదలపై తన్మయత్వం చెందుతున్నారు. బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా రెండు దేశాల మధ్య ఉద్రిక్త దౌత్య సంబంధాన్ని పంచుకునే వారధిగా ఉంటుందని నొక్కి చెప్పారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానం మేరకు ఆసియా కప్ మ్యాచ్‌లను వీక్షించిన తర్వాత బిన్నీ, శుక్లా అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారు. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

పాకిస్తాన్‌లో చాలా మంచి సమావేశం జరిగిందని, మంచి ఆతిథ్యం లభించిందని… చాలా చక్కగా చూసుకున్నారని రోజర్ బిన్నీ పీటీఐకి చెప్పారు. పాకిస్తాన్ లో జరిగిన క్రికెట్ చూడటం, వారితో కూర్చుని విషయాలు చర్చించడం ఆనందాన్నిచ్చిందన్నారు. పాకిస్తాన్ తమను ఎంతగానే గౌరవించిందని…. పర్యటనలో సకల సౌకర్యాలు కల్పించిందన్నారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు నిలిపివేయబడినందున రెండు దేశాలు ICC లేదా ACC ఈవెంట్‌లలో మాత్రమే ఒకదానితో ఒకటి ఇప్పటి వరకు పోటీపడుతున్నాయి. చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లింది. పాకిస్థాన్‌లో చివరిసారిగా 2006లో ద్వైపాక్షిక సిరీస్‌కు భారత్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పాస్తాన్ చివరిసారిగా 2012లో వైట్ బాల్ పర్యటన కోసం భారత్‌ను సందర్శించింది.

పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ను పునఃప్రారంభించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు, బిన్నీ తాము దానిపై కాల్ తీసుకోలేమని పునరుద్ఘాటించారు. ” చెప్పలేం. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. వారు కాల్ తీసుకోవాలి. బీసీసీఐ వేచి చూడాల్సిందే. మేం ఆశాజనకంగా ఉన్నాం. త్వరలో ప్రపంచ కప్ వస్తోంది, పాకిస్తాన్ జట్టు ఆడటానికి భారతదేశానికి వస్తుంది” అని చెప్పాడు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు ఇప్పటికే తలపడ్డాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ పోరులో రెండు జట్లు అహ్మదాబాద్‌లో అక్టోబరు 14న తలపడనున్నాయి. ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్, భారత్‌కు వెళ్లడంపై రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, చివరికి PCB అంగీకరించింది.