అబ్దుల్ కలాం మాక్స్ లిమిటెడ్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా చైర్మన్ షేక్ మస్తాన్ వలి (ఆరా మస్తాన్) ఆధ్వర్యంలో “అబ్దుల్ కలాం మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ అండ్ త్రిఫ్ట్ సొసైటీ లిమిటెడ్” మొదటి బ్రాంచ్ ని ప్రారంభమైంది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం మ్యాక్స్ లిమిటెడ్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పాటును అందిస్తోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాలకు, రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాలను అందించడం ద్వారా, ఆయా వర్గాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్ ఆరా మస్తాన్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అబ్దుల్ కలాం మ్యాక్స్ లిమిటెడ్ మొదటి సభ్యత్వాన్ని మర్రి రాజశేఖర్ కు చైర్మన్ షేక్ మస్తాన్ వలి అందించారు.
