Andhra PradeshHome Page Slider

సాధారణ ప్రజల సంక్షేమం అభివృద్ధి ఆరా ఫౌండేషన్ లక్ష్యం

ఆదివారం 20-08-2023 న మద్దిరాల గ్రామంలో “అబ్దుల్ కలాం మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ అండ్ త్రిఫ్ట్ సొసైటీ లిమిటెడ్” ప్రారంభం

ఆరా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ షేక్ మస్తాన్ వలి గారు తాను పుట్టి పెరిగిన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎల్లప్పుడు తపనపడే వ్యక్తి. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న పేదలు సామాజికపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలి. ఉద్యోగాల కల్పన జరగాలి. ఆ ఆలోచనలతోనే ఆరా మస్తాన్ గారు తాను పుట్టిన గడ్డ మద్దిరాల గ్రామంలో పేద పిల్లలు చదువుకునే స్కూలును ఎంతో అభివృద్ధి చేశారు. అలానే పై చదువుల కోసం చిలకలూరిపేటకు వివిధ ప్రాంతాలకు వెళ్లే పేద విద్యార్థుల కోసం బస్సు పాసులను ఉచితంగా పంపిణీ చేశారు. తాను సంపాదించిన సంపాదనలో సింహభాగం నిరుపేద వర్గాల ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా సహాయ, సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. ఇక కరోనా కాలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివి. తాను స్థాపించిన ఆరా సర్వే సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ, ఉపాధిని కల్పిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మంచి పనులు కు ఫుల్ స్టాప్ లేదనే చెప్పాలి.

ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆయన తన ప్రాంత ప్రజలు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కొత్తగా మద్దిరాల గ్రామంలో ఈ ఆదివారం నాడు గౌరవనీయ శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారి చేతుల మీదగా “అబ్దుల్ కలాం మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ అండ్ త్రిఫ్ట్ సొసైటీ లిమిటెడ్” మొదటి బ్రాంచ్ ని ప్రారంభించబోతున్నారు. ఈ అబ్దుల్ కలాం మాక్స్ లిమిటెడ్ ఆ ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులతో పాటు, అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగటానికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ సొసైటీని ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంతంలోని రైతులకు వ్యవసాయ పంట రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై రుణాలు, మహిళల అభివృద్ధి కోసం మహిళ యువజన సంఘాలకు రుణాలు, యువత కోసం ద్విచక్ర వాహనాల రుణాలు, వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు, చిరు వ్యాపారస్తుల కోసం బుణాలు, ఆటోలు తోలుకునే కార్మికుల కోసం నూతనంగా ఆటోలు కొనుగోలుకు రుణాలు, వివాహం కొరకు గృహ నిర్మాణం కొరకు ఇలా ఎన్నో రకాల రుణాలను అతి తక్కువ వడ్డీకే అందించడం ద్వారా సమాజంలో వారు కూడా ఆర్థికంగా ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మొదటి బ్రాంచిని ఈ నెల 20వ తేదీన ప్రారంభించబోతున్నారు.