Home Page SliderTelangana

కీచక టీచర్ -దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

టీచర్ ముసుగులో కీచకుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో స్థానిక ఉన్నత పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో హద్దులు మీరి ప్రవర్తించాడు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పవలసిన పీఈటీ టీచర్ ఈరకంగా ఉండడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడ్డారు. శుక్రవారం నాడు అతడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. వేసవి సెలవులకు ముందు అతడు వేర్వేరుగా ముగ్గురు బాలికలను పాఠశాల భవనం పైకి తీసుకెళ్లాడట. అక్కడ తనకు ముద్దు పెట్టాలని, లేదంటే భవనం పైనుండి తోసేస్తానని బెదిరించాడు. దీనితో బాలికలు బాగా భయపడిపోయారు. ఇప్పుడు సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచినా కూడా తాము వెళ్లమని, పీఈటీ అంటే భయమని చెప్పడంతో తల్లిదండ్రులు ఆగ్రహం పట్టలేకపోయారు. స్కూలుకు వెళ్లి అతడికి దేహశుద్ది చేశారు. ప్రధానోపాధ్యాయుడు కూడా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో వారు  పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. సాయంత్రం వరకూ పోలీస్ స్టేషన్‌లో ఆందోళనలు చేశారు. ఈ ఘటనపై డీఈఓ వచ్చి పీఈటీను, ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేశారు. పోలీస్ సీఐ వారిపై చర్యలు తీసుకుంటామని, పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.