Home Page SliderNational

లింగాయత్ ఓటర్లున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ విజయాలు

బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం తర్వాత, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ ఓట్ల పరంగా బీజేపీకి భారీ నష్టాన్ని మిగిల్చింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడికి టిక్కెట్ నిరాకరించడంతో పాటు, లింగాయత్ ఓట్లు నిర్ణయాత్మకమైన కొన్ని సీట్లలో వైఫల్యానికి ఇది కారణమయ్యింది. కర్నాటక జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉండగా, వారు దాదాపు 80 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చూపించగలరు. ఇందులో కాంగ్రెస్ 53, బీజేపీ 20 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. మొత్తంగా 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 137 సీట్లు గెలుచుకుంది.

హాస్యాస్పదమేమిటంటే, లింగాయత్ మద్దతు కారణంగానే బీజేపీకి తమ ఉనికి ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించింది. 80వ దశకంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లింగాయత్ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను ఆకస్మికంగా తొలగించిన తర్వాత, మొదట్లో కాంగ్రెస్ మద్దతుదారులైన లింగాయత్‌లు, క్రమేపీ తమ విధేయతను 1980 నుంచి బీజేపీకి మార్చుకున్నారు. నేడు, వారు రాష్ట్రంలోని ఏకైక అతిపెద్ద కుల సమూహంగా ఉన్నారు.

జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న లింగాయత్‌లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి సవాడికి టిక్కెట్ నిరాకరించడం కూడా బీజేపీకి నష్టం కలిగించింది. రాష్ట్రానికి తొమ్మిది మంది ముఖ్యమంత్రులను అందించి, రాజకీయంగా కీలకమైన లింగాయత్‌లను పార్టీకి దూరం చేసింది. మార్చిలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌లను రద్దు చేసి, లింగాయత్‌లు, వక్కలిగలకు ఇవ్వడంపైనా ఆగ్రహం వ్యక్తమయ్యింది.