Home Page SliderTelangana

మణిపూర్ విద్యార్థుల్ని రిసీవ్ చేసుకున్న మంత్రి మల్లారెడ్డి

మణిపూర్ నుండి వచ్చిన తెలంగాణా విద్యార్థులను శంషాబాద్ ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నారు తెలంగాణా మంత్రి మల్లారెడ్డి. మణిపూర్ నుండి వచ్చిన తెలంగాణా, ఆంధ్ర విద్యార్థులు మొత్తం  214 మంది అనీ, అందులో తెలంగాణా విద్యార్థులు 106 మంది ఉన్నారని తెలియజేశారు. ఎయిర్ పోర్టులో 14 బస్సులు సిద్ధంగా ఉంచామని, వాటిలో వారి వారి ఊర్లకు వాళ్లను తరలిస్తామని  మంత్రి పేర్కొన్నారు. మరొక 36 మంది కలకత్తా నుండి నేటి రాత్రికి వస్తారన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ముందుచూపుతో అక్కడి ప్రభుత్వంతో, పోలీసులతో  మాట్లాడి ఈ ఏర్పాట్లన్నీ చేసారన్నారు. ఇంత బాగా తమను ఆదరించి, తమ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసి, ఎస్కార్టు సహాయంతో క్షేమంగా హైదరాబాద్ చేర్చిన ప్రభుత్వాధికారులకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు విద్యార్థులు. వీరు మణిపూర్‌లోని ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలలో చదువుకునే విద్యార్థులు.