Home Page SliderNationalNews Alert

ది కేరళ స్టోరీ విడుదల చేయవద్దంటూ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

ది కేరళ స్టోరీ చిత్రం రిలీజ్‌ కాకముందే  తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ సినిమాను మే 5న విడుదల చేయవద్దంటూ కేరళ ప్రభుత్వంతో సహా కాంగ్రెస్‌, సీపీఐ వంటి పార్టీలు, ముస్లిం సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సినిమా విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా రిలీజ్‌ చేస్తే సమాజంలో మత సామరస్యాలు దెబ్బతింటాయంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. దీంతో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా వివాదం కేరళలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా పాకింది. తమిళనాడులో ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ బృందం సూచన చేసింది.

సినిమా మేకర్స్‌పై కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం విమర్శించారు. ఈ సినిమా హిందూ, ముస్లిం మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేశారు. కేరళను తప్పుగా చిత్రీకరిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శించారు.