Andhra PradeshHome Page Slider

పవన్ ఒక అజ్ఞాని-చంద్రబాబు ఒక సైకో అన్న అంబటి

కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాని అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు కాపుల విషయంలో సైకోలా వ్యవహరిస్తున్నారని మండపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏపీలోని కాపుల ఓట్లన్నీ టిడిపీకి వేయించాలను కుంటున్నారని, కానీ ప్రజలు పవన్ అంత అజ్ఞానులు కాదని పేర్కొన్నారు. ఎవరు వారికి మేలు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబును ఎప్పటికీ ప్రజలు క్షమించరని, టిడిపి అంటేనే కాపు వ్యతిరేకపార్టీ అని అందరికీ తెలుసన్నారు. పవన్, చంద్రబాబులు కలుస్తూనే ఉంటారని, కానీ వారి మధ్య పొత్తు లేనట్లు నటిస్తుంటారని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు కేసులు పెట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే కాపులపై ఎన్నో కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుకు రామోజీరావు కూడా తోడయ్యాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు చరిత్ర తెలియదన్నారు. పవన్‌ను కాపులు నమ్మొద్దన్నారు.