చిలకలూరిపేటలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
ప్రతిష్టాత్మక ఆరా ఫౌండేషన్… పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రంజాన్ పవిత్ర మాసంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆదివారం అనగా 16-4-2023 సాయంత్రం 4:00 నుండి చిలకలూరిపేట పట్టణం, నరసరావుపేట రోడ్డు లోని గోల్కొండ గార్డెన్స్‌లో ఇఫ్తార్ విందుతోపాటుగా, ప్రముఖ మోటివేటర్ బ్రదర్ షఫీతో “ఇహ పరలోక సాఫల్య మార్గం” అనే అంశంపై గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, తప్పక హాజరు కావాలని.. ఆరా ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ మస్తాన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు ఎంట్రీ పాస్‌లను తీసుకొని రావాల్సి ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికీ ఎంట్రీ పాస్ లభించనివారు 9290092575 ఫోన్ నెంబర్‌ను కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరారు.

