ఇంతపెద్ద కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం లేదు
తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అయిన తమిళిసైకి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తున భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఈరోజు కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. గవర్నర్‌కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య గత కొన్ని నెలలుగా పెండింగ్ బిల్లుల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది రాష్ట్రప్రభుత్వం. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ అధికారులు, 30 మంది బౌద్ధగురువులు కూడా హాజరుకానున్నారు.