పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ వేణు శ్రీరామ్ గుడ్‌న్యూస్ చెప్పారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో “వకీల్ సాబ్-2” కూడా ఉంటుందని దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “నేను ప్రస్తుతం 3 స్రిప్టులపై పనిచేస్తున్నా.. అందులో వకీల్ సాబ్-2” కూడా ఉందన్నారు. ఇది వకీల్ సాబ్ ప్రీక్వెల్ కంటే చాలా అద్భుతంగా ఉంటుందని వేణు శ్రీరామ్ స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

