Andhra PradeshHome Page Slider

అంతిమంగా నిలిచేది..గెలిచేది అమరావతే: చంద్రబాబు

అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి నేటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత రైతులకు మద్దతు తెలుపుతూ..ట్వీట్ చేశారు. అమరావతి రైతుల ఉద్యమంలో న్యాయం ఉందన్నారు. ధర్మం అమరావతి రైతుల వైపే ఉందన్నారు. కాగా రైతుల పోరాట స్పూర్తి అద్భుతమని చంద్రబాబు తెలిపారు.  ఏపీలో వైసీపీ ప్రభుత్వ ఆంక్షలు,వేధింపులు,సంకెళ్లను ఎదిరించి అమరావతి ఉద్యమం ముందుకు సాగుతోందన్నారు. ఈ పోరాటంలో అంతిమంగా నిలిచేది..గెలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు.