ఏజెన్సీలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
బోయ,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ఏరియాలలో బంద్‌లు, ఆందోళనలు చేస్తున్నారు. పాడేరు, చింతపల్లి, అల్లూరు సీతారామరాజు మన్యం, పార్వతీ పురం మన్యం వంటి ఏజెన్సీలలో వారపు సంతలు రద్దయ్యాయి. వ్యాపారాలు జరగడం లేదు. నుండి వైసీపీకి అండదండలుగా ఉన్న గిరిజన తండాలకు అన్యాయం జరిగేలా ఉన్న ఈ అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏడుగురు ఎమ్మెల్యేలను ఇచ్చామన్నారు. అయినా గిరిజనులకు ఉద్యోగావకాశాలను గండి కొట్టే విధంగా బోయ, వాల్మీకి లాంటి ఉన్నత, ధనిక వర్గాలను ఎస్టీల్లో చేర్చే తీర్మానం అన్యాయం అన్నారు. వ్యాపార సంస్థలు, పర్యాటక కేంద్రాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నారు. స్థానికేతరులకు మన్యంలో సెంటు భూమికూడా ఇవ్వలేమన్నారు. గిరిజన చట్టాలను తప్పని సరిగా అమలుచేయాలని ఆదివాసీలకు అన్యాయం చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీలపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. అరకు, మన్యం ప్రాంతాలలో జేఏసీ నాయకుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


 
							 
							