Home Page SliderInternational

నేటి నుంచి ప్రచార బరిలోకి దిగనున్న ట్రంప్

అమెరికాలో త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్  ప్రచార ఏర్పాట్లు షురూ చేసినట్లు కన్పిస్తోంది. కాగా ఆయన ఈ రోజు నుంచే టెక్సాస్ రాష్ట్రంలోని వాకో ప్రాంతం నుంచి అధికారికంగా ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ సభకు దాదాపు 15వేలమంది ట్రంప్ మద్దతుదార్లు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  కాగా ప్రస్తుతం హష్‌మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ క్రమంలో ఇవాళ ఆయన ప్రచార సభను నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.