సజ్జల భలే చెప్పారుగా… వామ్మో ఏం కాన్ఫిడెన్స్
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు బాగా ఆదరించారన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ గెలవడం అతిపెద్ద విజయమన్నారు. ఐతే… నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని… ఆ పథకాల్లో గ్రాడ్యుయేట్లు లేరని.. అందుకే ఫలితాలు ఇలా వచ్చాయని సజ్జల చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ఎన్నిక రాష్ట్రం మొత్తానికి వర్తించదన్నారు. ఐనప్పటికీ… ఆ వర్గాలకు చేరువ కావడంలో లోపమేంటో తెలుసుకుంటామన్నారు.

కమ్యూనిస్టు పార్టీలు టీడీపీతో కలవడం కొంత కలిసి వచ్చిందన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు టీడీపీకి వెళ్లాయన్నారు. అన్ని శక్తులు ఏకమయ్యాయన్న సజ్జల… ఏకమైన ఓట్లు ఒక సెక్షన్ కు సంబంధించినవేనన్నారు. కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న టీచర్ల ఎమ్మెల్సీలు ఈసారి అధికారపార్టీగా దక్కడం విశేషమన్నారు. ఈ ఎన్నికతో ఏదో మారిపోయింది అనుకోవద్దని టీడీపీకి హితవు పలికారు. కౌంటింగ్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. అన్ని సెక్షన్ల ఎన్నికలు జరిగినపుడు అయితే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ఈ ఓటర్లు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందని ఓటర్లని సరిపెట్టుకుంటున్నామన్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ సంతృప్తికరమే అన్నారు. వైసీపీపై ఈ ఫలితాలు ఏ రకంగాను ప్రభావితం చూపబోవన్నారు. ఈ విజయంతోనే టీడీపీ పుంజుకుందని ఆనందం పొందుతుందని, ఆ పార్టీ బలం పెరిగిందనుకోవడం హాస్యాస్పదమన్నారు సజ్జల.