పంజాబ్ ఐపీఎస్ ఆఫీసర్‌తో ఆప్ విద్యా శాఖ మంత్రి పెళ్లి
ఆప్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్, ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌తో ఈ నెలాఖరులో వివాహం చేసుకోబోతున్నారు. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకొంది. రూప్‌నగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బైన్స్ ప్రస్తుతం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న బైన్స్, జ్యోతి యాదవ్‌లను అభినందించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన 32 ఏళ్ల బైన్స్ ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని గంభీర్‌పూర్ గ్రామానికి చెందినవాడు. 2017 ఎన్నికల్లో సాహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. బెయిన్స్ గతంలో ఆప్ యువజన విభాగానికి నాయకత్వం వహించారు. 2014లో చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి BA LLB (ఆనర్స్) పూర్తి చేశాడు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలో సర్టిఫికేట్ కోర్సు చేశాడు.

పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సా జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన జ్యోతి యాదవ్ గత సంవత్సరం ఆప్ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్‌తో ఘర్షణ సంచలనమయ్యింది. ఐపీఎస్ అధికారి తన అసెంబ్లీ నియోజకవర్గంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు, తనకు చెప్పారా అంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇద్దరు మధ్య గొడవ మీడియాలో సంచలనంగా మారింది. లూథియానాలో నాడు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న జ్యోతి యాదవ్, లూథియానా సౌత్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, సంఘ వ్యతిరేక వ్యక్తులపై సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని… పై అధికారుల సూచనలతో సెర్చింగ్‌కు వచ్చానని చెప్పారు. గతేడాది పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం మన్, గురుప్రీత్ కౌర్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆప్ ఎమ్మెల్యేలు నరీందర్ కౌర్ భరాజ్, నరీందర్‌పాల్ సింగ్ సవానా కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు.