సీఎంల ప్రమాణ స్వీకారానికి త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌కు మోదీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. మార్చి 7న నాగాలాండ్, మేఘాలయలో ఎన్డీఏ ప్రభుత్వాల ప్రమాణ స్వీకారోత్సవాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. మరుసటి రోజు త్రిపురలో జరిగే వేడుకల్లోనూ పాల్గొంటారు. ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… బీజేపీ మెరుగైన పనితీరు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు ఉన్న దృఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయని… బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ అన్నారు. త్రిపురలో బీజేపీ మరోసారి సునాయాసంగా విజయం సాధించింది. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో కలిసి నాగాలాండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మేఘాలయలో హంగ్ హౌస్‌ను అడ్డుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి బీజేపీకి పిలుపు వచ్చింది. మూడు ఈశాన్య రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తల కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నారని… అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.

