నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ సోదాలు
మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ నేత పి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లి ఇళ్లలో తనిఖీలకు దిగారు. అమరావతి భూముల కొనుగోలు విషయమై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నారాయణ, మున్సిపల్ మంత్రిగా వ్యవహరించారు. రాజధాని భూముల సేకరణ విషయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మొత్తం ల్యాండ్ సెటిల్మెంట్లు జరిగాయని చాన్నాళ్లుగా వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.

