శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ‘షూ’లో దొరికిన కోట్ల విలువ చేసే బంగారం
సూడాన్ నుండి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుండి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ విమానాశ్రయంలో అడపాదడపా బంగారం స్మగ్లింగ్ బయటపడుతోంది. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన అధికారులు అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వీరు షూ కింద భాగంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు తెలింది. ఈ బంగారం విలువ సుమారు 8 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అత్యధిక విలువ గల బంగారం ఇదేనంటున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి, మిగతా వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.

