Home Page SliderTelangana

హైదరాబాద్ మెట్రో హెవీ రష్

హైదరాబాద్ మెట్రో సేవలను పెంచుతామంటూ చెబుతున్నప్పటికీ ప్రయాణీకులకు తగినన్ని ట్రిప్పులను అందించలేకపోతోంది. వీక్ ‌డేస్‌లో ముఖ్యంగా మెట్రో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ట్రైన్ లోపల కాలు పెట్టడానికి కూడా వీలుపడనంతగా కిక్కిరిసిపోతోంది. గమ్యస్థానాలకు వేగంగా వెళ్లాలన్న ఉద్దేశంతో ఖరీదెక్కువైనప్పటికీ.. ఎక్కువ మంది ప్రయాణీకులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే పీక్ టైమ్ లో రష్ మరింత ఎక్కువవుతోంది.

ముఖ్యంగా నాగోల్ నుంచి అమీర్ పేట్, కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ వరకు రష్ రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఎక్కువ మంది ఉద్యోగులు పొల్యూషన్ దెబ్బకు మెట్రోను ఆశ్రయిస్తుంటే.. యాజమాన్యం మాత్రం ప్రయాణీకులకు తగినట్టుగా సేవలు అందించలేకపోతోంది. ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లే సమయాల్లో ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సర్వీసులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.