ఇండియా టూర్… ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ
మోచేయి గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టుల నుంచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం డేవిడ్ వార్నర్ వైదొలగాల్సి వస్తోంది. ఇండియా పర్యటనలో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. రెండు టెస్ట్‌లలో పరుగుల కోసం కష్టపడిన వార్నర్, మొత్తం మూడు ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఎడమచేతి వాటం కలిగిన ఓపెనర్ ఢిల్లీ టెస్టులో బలమైన గాయంతో స్పృహతప్పిపోయాడు. మోచేయి ఫ్రాక్చర్ కావడంతో అవుట్ అయ్యాడు. దీంతో తర్వాత మ్యాచ్‌లు ఆడలేని పరిస్థితి నెలకొంది. డేవిడ్ వార్నర్ భారత్‌లోని క్వాంటాస్ టెస్ట్ టూర్ నుండి వైదొలిగాడని, స్వదేశానికి తిరిగి వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేయికి దెబ్బ తగలడంతో హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయింది. ఢిల్లీలో వార్నర్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రెన్‌షా వ్యవహరించాడు. తాజా ఎదురుదెబ్బతో ఇండోర్, అహ్మదాబాద్‌లో జరిగే మూడు, నాలుగో టెస్టులకు అతడు అందుబాటులో ఉండడు. 36 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్, టెస్టుల తర్వాత ఆడే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం భారతదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.
