Home Page SliderTelangana

ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తెలంగాణ, కేసీఆర్ తాలిబాన్

వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన షర్మిల కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని… తెలంగాణలో భారత రాజ్యాంగం లేదని, కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుందన్నారు. తెలంగాణ, ఇండియా ఆప్ఘనిస్తాన్‌లా తయారయ్యిందని… కేసీఆర్ తాలిబన్‌ల వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఆదివారం వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. సెక్షన్ 504 ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వక అవమానం కలిగించారని… SC, ST, POA చట్టంలోని సెక్షన్ 3(1)r కింద కేసు నమోదు చేశారు.

హామీలు నెరవేర్చలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ‘ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు.. మీ హామీలను నెరవేర్చకపోతే కొజ్జా అని అర్థం. కాస్ట్రేట్,” అని శనివారం జరిగిన బహిరంగ సభలో అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘గో బ్యాక్ షర్మిల’ అంటూ నినాదాలు చేస్తూ, పార్టీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు.