Andhra PradeshHome Page Slider

ఎట్టకేలకు పోసానికి పదవి… బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నటుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ టీవీ అభివృద్ధి సంస్థల చైర్మన్‌గా పోసాని కృష్ణ మురళి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. వీటన్నిటిని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జనాల్లో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయన అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. నాటక టీవీ రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు పోసాని కృష్ణ మురళి కళాతపస్వి కె. విశ్వనాథ్, దర్శకుడు సాగర్‌ల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.