Home Page SliderTelangana

ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదివారు-ఈటల

ప్రభుత్వం రాసి ఇచ్చిందే గవర్నర్ చదవారన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గవర్నర్‌తో ప్రభుత్వం అనేక అబద్ధాలు చెప్పించిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ అని గవర్నర్ ప్రసంగంలో చెప్పించింది శుద్ధ అబద్ధమన్నారు ఈటల. రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటల కరెంట్ కూడా రావడం లేదని… పంటలు ఎండిపోతున్నాయని రైతులు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ధర్నాలు చేస్తున్నారన్నారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ‘ధరణి’ అని హడావిడి చేసిన ప్రభుత్వం, ఇవాళ గవర్నర్ స్పీచ్ లో ‘ధరణి’ ప్రస్తావనే తేలేదన్నారు. ‘ధరణి’ లో ఉన్న తప్పులను సరిచేసి ఆవకాశమే లేకుండా చేశారన్నారు. ‘ధరణి’ పేరుతో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. సిద్దిపేట, గజ్వేల్ మినహా… తెలంగాణ పల్లెల్లో పేద ప్రజానీకానికి 2bhk లు ఎక్కడా కట్టలేదన్నారు. 2bhk, ధరణి వలన పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందన్నారు. మొత్తంగా చూస్తే… గవర్నర్ స్పీచ్ అంతా కూడా తప్పులతడకేనన్నారు.