Home Page SliderTelangana

కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి మరణించారు. ఆయన వయసు 92. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల వంటి గొప్ప చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విశ్వనాథ్ 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించబడ్డారు. ఐదు జాతీయ అవార్డులు, ఏడు నంది అవార్డులు గెలుచుకున్నారు. మానవీయ, సామాజిక అంశాల రేంజ్‌లో సినిమాలు తీయడంలో పేరుగాంచిన ఆయన 1951లో పాతాళ భైరవిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా దర్శకుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. తన 50 ఏళ్ల కెరీర్‌లో కులం, అంగవైకల్యం, లింగ వివక్ష, స్త్రీ ద్వేషం వంటి అంశాలపై సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం 2010లో శుభప్రదం. అగ్రశ్రేణి నటులు, నటీమణులతో పనిచేశారు. విశ్వనాథ్ చిత్రాల్లోని సంగీతం, పాటలకు ప్రత్యేక శైలి ఉంది. సినిమాల్లో విలువలు సంగీతానికి చిరునామాగా నిలిచాయి. కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు విశ్వానాథ్. నటుడు చంద్ర మోహన్, దివంగత గాయకుడు S.P. బాలసుబ్రహ్మణ్యం, S.P. శైలజ ఆయనకు బంధువులు.