ఒడిశా మంత్రిని కాల్చి చంపిన పోలీస్
అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కాల్పుల్లో ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిసోర్ దాస్ ఈరోజు మరణించారు. ఒడిశా మంత్రి ఛాతీపై పోలీసు కాల్పులు జరిపి కొన్ని గంటల తర్వాత చికిత్సపొందుతూ చనిపోయారు. జార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి వెళుతుండగా ఛాతీపై కాల్పులు జరిపాడు. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మంత్రికి ఆస్పత్రి వర్గాలు పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రయత్నించిందని అపోలో వర్గాలు తెలిపాయి. గుండె పంపింగ్ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నామని… అత్యవసర ICU సంరక్షణ అందించామన్నారు. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడలేదని గాయాలతో మరణించాడని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

