Home Page SliderNationalNews Alert

చందాకొచ్చర్‌ భర్తకు 3 రోజుల కస్టడీ

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు సీబీఐ కోర్టు 3 రోజులపాటు కస్టడీ విధించింది. చందా కొచ్చర్‌ 2012లో ఐసీఐసీఐ సీఈఓగా ఉన్నప్పుడు వీడియోకాన్‌ గ్రూప్‌కు లోన్స్‌ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆమెతోపాటు భర్త దీపక్‌ కొచ్చర్‌ను అరెస్ట్‌ చేసింది. వీడియోకాన్‌ గ్రూప్‌కు 3250 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ప్రతిగా ఆ కంపెనీ చీఫ్‌ వేణుగోపాల్‌ ధూత్‌… దీపక్‌ కొచ్చర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈ డీలింగ్‌ ద్వారా చందాకొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌ లాభపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 59 ఏళ్ల చందా కొచ్చర్‌, కన్య్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మరియు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీ అయిన వీడియోకాన్‌ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరక్టర్‌గా 2018 అక్టోబర్‌లో వైదొలిగారు.