Home Page SliderNational

విద్యార్థినిని ప్రేమించి, పెళ్లాడిన ఓ ఉపాధ్యాయుడు

ప్రేమ గుడ్డిది. ప్రేమకు వయసు, ప్రాంతం, కులం, మతం ఇలా ఎలాంటి తారతమ్యాలు ఉండవు. దీనికి తగ్గట్లే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర ట్రైనింగ్‌ వచ్చిన విద్యార్థినిని పెళ్లి చేసుకున్నాడు. బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న 42 ఏండ్ల సంగీత్‌ కుమార్‌ వృత్తిరీత్యా టీచర్‌. అయితే సొంతంగా ఇంటి వద్ద ఓ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఆ కోచింగ్‌ సెంటర్‌కు 24 ఏండ్ల విద్యార్థిని ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో టీచర్‌, విద్యార్థిని శ్వేతకుమారి మధ్య ప్రేమ చిగురించింది. టీచర్‌ ఆమెకు ప్రపోజ్ చేయడంతో విద్యార్థిని కూడా ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యాయి. అయితే.. ఉపాధ్యాయుడికి వివాహం కాగా, అతని భార్య కొన్నాళ్ల క్రితం మరణించింది.