గుజరాత్‌లో చరిత్ర సృష్టిస్తోన్న కమలం పార్టీ
గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ రానంత మెజార్టీ సీట్ల దిశగా ఆ పార్టీ విజయం సాధించేలా కన్పిస్తోంది. 182 స్థానాల్లో మెజార్టీ మార్క్ 92 కాగా ఆ పార్టీ ఇప్పటికే 153 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

గుజరాత్ లో బీజేపీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతటి మెజార్టీ దిశగా బీజేపీ రికార్డులు బద్ధలుకొడుతోంది. గుజరాత్‌లో బీజేపీ రికార్డు సృష్టించేలా కన్పిస్తోంది. మొత్తం 182 స్థానాల్లో 153 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 19 సీట్లకే పరిమితమయ్యేలా ఉంది. గుజరాత్‌లో సంచలన విజయం నమోదు చేయాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఏడు సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండో చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో రెండోసారి విజయం సాధించి చరిత్ సృష్టించాలని భావిస్తున్న బీజేపీకి, కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. 68 స్థానాల్లో హిమాచల్ అసెంబ్లీలో 35 స్థానాల్లో విక్టరీ సాధించాల్సి ఉంది. ఐతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

