భారత క్రికెట్ టీంలో ఏపీ అమ్మాయి
ఆస్ట్రేలియాతో భారత మహిళల క్రికెట్ జట్టు ఈ నెల 9 నుంచి 20 వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. ఏపీకి చెందిన అంజలి శర్వాణి భారత మహిళ జట్టులో చోటు సంపాదించుకుంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో ఆమె పాల్గొననుంది. అంజలి శర్వాణి కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందింది. అంజలి తండ్రి స్కూలు టీచర్, తల్లి గృహిణి. ఆదోనిలోని మిల్డన్ హైస్కూల్‌లో అంజలి టెన్త్ క్లాస్ వరకు చదివింది. క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అంజలి తన ఎడమచేతివాటం మీడియం పేస్ బౌలింగ్‌లో రాణిస్తోంది. 15 మందితో కూడిన టీమిండియా మహిళల బృందంలో చోటు దక్కించుకుంది. అయితే.. తమ పట్టణానికి చెందిన అమ్మాయి భారత మహిళల జట్టులో స్థానం సంపాదించడం పట్ల ఆదోనీ వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బంధుమిత్రులు, పట్టణవాసులు అంజలిని, ఆమె తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.

