NewsTelangana

గుండెపోటు.. ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్లే కృష్ణ మృతి

గుండెపోటు, మల్టీ ఆర్గాన్స్‌ వైఫల్యం వల్లే సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి చెందారని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం ఉదయం ఆస్పత్రికి వచ్చినప్పటికే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించామని కాంటినెంటల్‌ ఆస్పత్రి చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి చెప్పారు. 2, 3 గంటల తర్వాత అవయవాలు పని చేయడం మానేశాయని.. డయాలసిస్‌ చేసినా ఫలితం కనిపించలేదని.. ఎలాంటి చికిత్స అందించినా ఫలితం ఉండదని నిర్ధారణ అయిన తర్వాత వైద్య నీతి పాటించి ఆయనకు ఇబ్బంది కలగకుండా మన:శ్శాంతిగా వెళ్లిపోయేలా చేశామని వివరించారు. కృష్ణ మంగళవారం తెల్లవారు జామున 4.09 గంటలకు తుది శ్వాస విడిచారని.. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.