NationalNews

2. కి.మీ. నడిచి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి

ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటన  నిమిత్తం భువనేశ్వర్‌ చేరుకున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము బిజు పట్నాయక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఒడిశా గవర్నర్‌ గణేశీలాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆమెకు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్‌లో పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి ఆలయానికి కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత తన కాన్వాయ్‌ని ఆపించారు రాష్ట్రపతి. అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి బయల్దేరారు. సుమారు 2 కి.మీ. నడిచి వెళ్ళి జగన్నాథుడిని దర్శించుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులను రాష్ట్రపతి అప్యాయంగా పలుకరించారు. సుమారు గంట పాటు ఆమె ఆలయ సన్నిధిలో గడిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు.